ఓటీటీ ఎంత ఆఫర్ చేసినా నా సినిమా మాత్రం ధియేటర్ లోనే..

0
44
OTT Offering to RamPothineni New Movie

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా థియేటర్స్ అన్నిమూతపడగా విడుదల కావాల్సిన సినిమాలు అన్ని ఓటీటీ ని ఎంచుకుంటున్నాయి.. హీరో రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన నివేతా పేతురాజ్ హీరోయిన్ గా చేస్తుంది.. ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుండగా, మణిశర్మ దీనికి సంగీతం సమకూర్చుతున్నారు.. ఇందులో రామ్ రెండు భిన్నమైన పాత్రలను పోషించనున్నారు..ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా అడ్డుపడింది.. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీ దారిలో వెళుతుండడంతో రామ్ మూవీకి కూడా ఓటీటీలు రేట్స్ ని బాగానే ఆఫర్ చేసాయి.

చిన్న సినిమాలన్నీ ఓటీటీ లోకి ఒకదానివెంట మరొకటి క్యూ కట్టగా పెద్ద సినిమాలు మాత్రం ఆ దారిలో వెళ్ళలేదు.. ఇక ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం అనుకుని దిల్ రాజు ‘వీ’ సినిమాను ఓటీటీ విడుదల చేశాడు. అయితే రామ్ మాత్రం ఓటీటీలు ఎంత ఎమౌంట్ ను ఇస్తామన్నా తన సినిమా మాత్రం థియేటర్స్ లోనే విడుదల అవుతుందని రామ్ అంటున్నాడు.. ఈ కరోనా పరిస్థితులు తగ్గుముఖం పెట్టేవరకు వెయిట్ చేసి సినిమా థియేటర్ లోనే విడుదల చేయాలని రామ్ భావిస్తున్నాడు. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్నా సినిమా అవడంతో ‘రెడ్’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here