ఓటీటీ రిలీజ్ తో బ్రతికిపోయిన రాజ్ తరుణ్

33
OreyBujjiga

ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ లాంటి హిట్లతో కెరీర్ ఆరంభంలో మంచి ఊపుమీద ఉన్నాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. అతడి జోరు చూసి ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తనతో మూడు సినిమాలకు ఒకేసారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ రాజ్.. తనపై నెలకొన్న అంచనాలను చేరుకోవడంలో విఫలమయ్యాడు. ముందులా హిట్లు సొంతం చేసుకోలేకపోయాడు. చెప్పుకోవడానికి తొలి మూడు సినిమా హిట్లు మాత్రమే మిగిలాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి సినిమాలు ఓ మోస్తరుగా అలరించిన.. గత మూణ్నాలుగేళ్లలో వచ్చిన సినిమాలన్నీ అతడికి నిరాశనే అందించాయి. గత రెండేళ్లలో అయితే అతని సినిమాలు వచ్చింది వెళ్లింది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. చివరగా అతడి నుంచి వచ్చిన ఇద్దరి లోకం ఒకటే అయితే పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ స్థితిలో రాజ్ ఆశలన్నీ ఒరేయ్ బుజ్జిగా మీదే పెట్టుకున్నాడు.

గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం సినిమాల దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఈ సినిమాను తీశారు. పరిస్థితులు అనుకూలించి ఉంటే మార్చిలోనే ఈ చిత్రం విడుదల అవ్వాల్సింది. కరోనా వల్ల వాయిదా పడి.. ఈ మధ్యే ఓటీటీ ద్వారా ఆహాలో ఒరేయ్ బుజ్జిగా ను విడుదల చేశారు. పెద్దగా సౌండేమీ చేయలేదు. అంతే కాకుండా రివ్యూలు కూడా అంత పాజిటివ్ గా ఏమీ రాలేదు. బిలో యావరేజ్ సినిమాగా తేల్చేశారు ప్రేక్షకులు. ఆహాలో ఓ మోస్తరుగానే జనాలు ఈ సినిమాను చూశారు. అయితే ఈ చిత్రం థియేటర్లలో విడుదల చేసి ఉంటే మాత్రం ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పించగలిగేది కాదు. వసూళ్ల పరంగా కచ్చితంగా నిరాశ పరిచేది. ఓటీటీ ద్వారా విడుదలయ్యే సినిమాల ఫలితాన్ని కచ్చితంగా చెప్పడం చాలా కష్టం. వి, నిశ్శబ్దం లాంటి అంచనాలున్న సినిమాలకు వచ్చే స్పందన వ్యూయర్షిప్.. జరిగే చర్చను బట్టి ఒక అంచనాకు రావచ్చు కానీ.. ఒరేయ్ బుజ్జిగా లాంటి చిత్రాల గురించి ఏమీ తేల్చలేము. చిత్ర బృందమేమో దాన్ని బ్లాక్బస్టర్గా ప్రచారం చేస్తోంది. మొత్తానికి థియేటర్లలో విడుదల కాకపోవడంతో రాజ్ ఫ్లాప్ స్ట్రీక్ కు బ్రేక్ పడిందని అనుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here