ఏపీలో అన్ని బస్సులకు ఆన్ లైన్ టిక్కెట్లు … ఒకేసారి 50 వేల బుకింగ్స్ … రిజర్వేషన్ లో మార్పులు …!

0
69

ఏపీ లో కరోనా వైరస్ నైపథ్యంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేరుగా చేతికి ఇవ్వడం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆన్ లైన్ టికెట్ విధానంలో భారీగా మరుపులు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై అన్ని బస్సులకూ ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్ధను ఆర్టీసీ ఆధునీకరిస్తోంది. కరోనా వ్యాప్తి భయాలు ప్రయాణికుల్లో ఎక్కువుగా ఉన్నందున ఇకపై టికెట్ల కొనుగోళ్లలో నగదు రహిత విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది. దీని ప్రకారం ఇకపై అన్ని బస్సుల్లోనూ ముందస్తు రిజర్వేషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాంటాక్ట్ లెస్ టికెటింగ్ వ్యవస్దను ఏర్పాటు చేయనుంది. ఒకేసారి 50 వేల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేలా ఆన్ లైన్ వైబ్ సైట్లో మార్పులు చేస్తున్నారు. దింతో ఈ నెల 30న ఆర్టీసీ సర్వర్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు . ఈ నెల 30న రాత్రి 12 గంటల నుంచి జులై 1 ఉదయం 5 గంటల వరకు సర్వర్ పనిచేయదని అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఎలాంటి బుకింగ్స్, టికెట్ల రద్దు అందుబాటులో ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here