‘సరిలేరు నీకెవ్వరు’కి  ఏడాది..!!

23
One Year For Sarileru Nikevaru Movie

‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ గతేడాది సంక్రాంతి రేస్ లో  నిలిచిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఈ చిత్రం ద్వారా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. టాలీవుడ్‌లో రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా రిలీజై నేటితో వన్ ఇయర్‌ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకి, మహేశ్ అభిమానులకి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

జనవరి 11, 2020 గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. గుర్తుండిపోయే రోజు. థియేటర్లన్నీ ఒక పండగలా ఊగిపోయిన సంక్రాంతి. కొండారెడ్డి బురుజు విజువల్స్.. చుక్క చెమట పట్టలేదు, నా చొక్కా గుండి ఊడలేదు అన్న మహేశ్ డైలాగ్స్.. మైండ్ బ్లాక్ అంటూ ఆయన వేసిన స్టెప్పులు.. ఇలా  ఎన్నెన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి’ అని ఆ రోజుని  గుర్తు చేసుకున్నారు అనిల్ రావిపూడి. సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌కి  వన్ ఇయర్ అంటూ పోస్టర్ షేర్ చేస్తూ మహేశ్‌కి  థాంక్స్ చెప్పారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here