2021 లోనూ ఒలింపిక్స్ జరగడం కష్టమే..!

0
124
Tokyo Olympics postponed

ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యో లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021 జులై కి వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ జరగడం కష్టమేనని అంటున్నారు జపాన్ వైరస్ నిపుణులు. కరోనా చాలా వేగంగా విస్తరిస్తుంది. ఇపుడున్న పరిస్థుతులలో వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ జరిగేలా కనిపించడం లేదు.

వచ్చే ఏడాది వేసవి కల్లా జపాన్ కరోనాని నియంత్రించవచ్చు. కానీ మిగిలిన ప్రపంచ దేశాలు ఈ వ్యాధి నుండి బయట పడతాయని చెప్పలేం. ఒలింపిక్స్ అంటే అన్ని దేశాలు కలిసి చేసుకునే అతి పెద్ద సంబరం అని జపాన్ ప్రొఫెసర్ కేవంట అన్నారు. కరోనాకి త్వరగా టీకా కనిపెడితే తప్ప ఒలింపిక్స్ గురించి ఆలోచించలేము అన్నారు. ఏదయినా టీకా పైన నే ఆధార పడిఉంది. షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ ఈ సంవత్సరం జులై 24 నుచి ఆగష్టు 9 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాది జులై 24 నుంచి ఆగష్టు 9 కి వాయిదా పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here