మూడు గెటప్స్‌లో కనిపించబోతున్న నితిన్ ..!!

18
Nithin In 3 get Ups

యూత్ స్టార్ నితిన్ ఈ ఏడాది మంచి జోరు మీదున్నాడు. ఈ కుర్ర హీరో నటించిన చెక్ ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  నితిన్ నటించిన మరో చిత్రం రంగ్ దే.

మార్చి 26న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇంకోవైపు నితిన్ , మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ దుబాయ్‌లో జరుగుతున్నట్లు తెలుస్తుంది.  ‘అంధాదున్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ జోడిగా నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. జూన్ 11న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇటీవలే  తెలిపారు.

నితిన్‌ హీరోగా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే . పవర్ పేట  టైటిల్‌తో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ  అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ మూవీలో నితిన్ మూడు గెటప్స్‌లో కనిపించనున్నాడని అంటున్నారు. 20 ఏళ్ళు, 40 ఏళ్లు, 60 ఏళ్ళు ఇలా మూడు పాత్రలలో వైవిధ్యమైన నటనతో అలరించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తారని, తెలుగుతో పాటు తమిళంలో ఈ మూవీ విడుదల కానుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here