కరోనా ఎఫెక్ట్ తో న్యూజిలాండ్ బౌలర్ ‘ఫెర్గూసన్’ కి చుక్కెదురు..!!

0
181
New Zealand bowler Lockie Ferguson tests negative

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాస్త జలుబు చేసినా సరే నానా.. హైరానా పడి పోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్థితి న్యూజిలాండ్ బౌలర్ లోకి ఫెర్గూసన్ కూడా ఎదురయ్యింది. ఆస్ట్రేలియాతో సిడ్నీ లో తొలి వన్డే ఆడిన తర్వాత అతనికి కొంత అనారోగ్యంగా కనిపించడంతో కివీస్ బోర్డు వెంటనే స్పందించింది. కరోనా వైరస్ కు సంబంధించి పరీక్షలకు పంపడంతో పాటు 24 గంటల పాటు ఎవరితో కలవకుండా హోటల్ రూమ్ లోనే ఉండాలని నిర్బంధించింది. పరీక్షల అనంతరం రిపోర్టులో నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకుని ఫెర్గూసన్ ఆక్లాండ్ లోని తన ఇంటికి చేరుకున్నాడు.

దీనిపై అతను స్పందిస్తూ తనకు జరిగిన అనుభవాన్ని వివరించాడు కరోనా విషయంలో అతి చేసినట్లు అనిపించింది అని వ్యాఖ్యానించాడు. నా ఆరోగ్యం పై చాలా మంది ఆందోళన చెందారు. నేను బాగానే ఉన్నాను అని వారందరికీ సమాధానం ఇచ్చాను, నాకు కాస్త జలుబు చేసింది ,అంతే అంతకుమించి ఏమీ కాలేదు. టీం వైద్యులు నిబంధనలు అమలు చేశారు కాబట్టి అర్థం చేసుకోగలను కానీ మొత్తంగా చూస్తే అంతా అతి చేసినట్లు అనిపిస్తుంది అని అన్నాడు. మరోవైపు కరోనా వైరస్ కారణంగా మరో రెండు క్రికెట్ ఈవెంట్లు అర్థాంతరంగా రద్దు అయ్యాయి. జింబాబ్వే లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ కౌంటీ జట్టు డెర్బీషైర్ టూర్ ను రద్దు చేసుకుని స్వదేశం ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ చివరి రెండు మ్యాచ్లు కూడా రద్దయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here