ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి సరికొత్త  టైటిల్..!!

18
Ntr Trivikram New Movie

అల వైకుంఠపురం మూవీ తో సూపర్ హిట్ ని అందుకున్న త్రివిక్రమ్, త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో అని ప్రకటించాడు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్  పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ వచ్చేస్తాడు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులు పూర్తిచేసాడని టాక్. సినిమా టైటిల్ ఇదేనంటూ పుకార్లు బయటకి వచ్చాయి.

రాజకీయా నేపథ్యంలో కథ సాగుతుందని ‘అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ ఫిక్స్ చేసారని చెప్పారు.తాజా సమాచారం ప్రకారం మరో కొత్త టైటిల్ తెర మీదకి వచ్చింది. చౌడప్ప నాయుడు పేరుతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు.చిత్రబృందం ఈ పేరుని పరిశీలిస్తున్నట్టు  ఫిలిమ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ పేరు చూస్తుంటే ఫ్యాక్షన్  సినిమా అని అనిపిస్తుంది. ఈ టైటిల్ అయినా ఫిక్స్ అయినట్టేనా, లేదా అన్నది చిత్రబృందం స్పందిస్తేనే కానీ  తెలీదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here