ఓటిపి చెబుతేనే రేషన్

18
Ration

ఆంధ్ర ప్రదేశ్ లో సిఎం జగన్ నూతన విధానాల ను ప్రవేశపెడుతూ అభివృద్ది పథం లో దూసుకొని వెళ్తున్నారు .దీనిలో భాగంగా  రేషన్ షాపుల దెగ్గర సరుకుల కోసం గంటలు గంటలుగా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా  కొత్త విధానాన్ని పరిచయం చెయ్యబోతున్నారు.  రేషన్ షాప్ లో వేలిముద్ర తో కాకుండా మొబైల్ కు వచ్చే ఓటిపి తో సరుకులు పంపిణీ చెయ్యబోతున్నారు దీనికి సంబంధించి  అన్నీ ఏర్పాట్లను పౌరసరఫరాల శాఖ తయారు చేసింది.

ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ కొత్త విధానాన్నిఅమల్లో కి తీసుకొని వస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ తెలిజేసింది. రాష్ట్రం లో ఉన్న  రేషన్ డీలర్ల కు ఆదేశాలు కూడా అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న బయోమెట్రిక్ విధానం వల్ల కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్లా ఈ కొత్త విధానాన్ని తెస్తున్నట్లు ప్రభుత్వం తెలిజేసింది. కస్టమర్ ఆధార్ కు అనుసంధానం అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ కు ఓ ఓటిపి వస్తుంది దాన్ని  చెప్తేనే రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది.

ఒకవేళ లబ్ధిదారులు  యొక్క ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అవ్వని పరిస్థితిలో దగ్గరలో ఉన్న మీ సేవ, ఆధార్ సెంటర్లలకు వెళ్ళి వెంటనే అనుసంధానం చేసుకోవాలంటూ పౌరసరఫరాల శాఖ తెలిజేసింది ఈ విధానం ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల అమలు చేస్తున్నారు. ఇంకా  ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఓటీపీ పద్ధతి తో సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.రేషన్ డోర్ డెలివరీ ని ఫిబ్రవరి 1 నుండి ప్రారంభించబోతుంది దీనిలో భాగంగానే ఈ విధానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here