జపాన్ ప్రధానులు ఆ రెండు దేశాల్లోనే తొలి అధికార పర్యటన..

21
New Japan PM Suga to make first foreign visits..?

జపాన్‌ కొత్త ప్రధాని యోషిహిడే సుగో తొలి అంతర్జాతీయ పర్యాటన ఖాయమైంది. ఈ నెల 18 నుంచి 21 వరకు ఆయన వియత్నం, ఇండొనేషియా దేశాల్లో పర్యటిస్తారని ఆ దేశ చీఫ్‌ క్యాబినెట్‌ కార్యదర్శి కట్సూనోబు కటో శుక్రవారం తెలియజేసారు. మూడురోజులపాటు ఈ పర్యటన ఉంటుందని అయన తెలిపారు. ఇంతకుముందు ప్రధాని అయిన షింజో అబే సైతం తొలిసారి అధికారికంగా పర్యటించింది ఈ రెండు దేశాల్లోనే.ఇప్పటి ప్రధాని కూడా పర్యటించేందుకు ఈ రెండు దేశాలనే ఎన్నుకోవడం గమనార్హం.

గతనెల జపాన్‌ నూతన ప్రధానిగా యోషిహిడే సుగోను న్యాయ కోవిదులు సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ప్రధానిగా ఉన్న షింజో అబే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నకారణంగా ఆగష్టు 28న తన పదవికి రాజీనామా చేశారు. వియత్నం, ఇండొనేషియాతో జపాన్‌కు మంచి స్నేహ సంబంధాలు కొనసాగుతున్నందున తొలి అధికార పర్యటనకు సుగో ఈ రెండు దేశాలనే ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here