వలంటీర్లే.. ఆ నలుగురై!

0
123
Narasaraopet corona death

కరోనా నేపథ్యంలో ఎవరైనా మరణిస్తే పరీక్షల అనంతరమే దహన సంస్కారాలు చేయించాల్సిన దుస్థితి దాపురించింది. రక్త సంబంధీకులు సైతం ఆమడ దూరంలో ఉంటున్న ప్రస్తుత తరుణంలో జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అన్ని వారై ముందుకు సాగుతున్నారు. ఇక వివరాలు పరిశీలిస్తే గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థానిక 30 వ వార్డు ఏనుగుల బజారుకు చెందిన షేక్ నన్నే బుజ్జి అనే 75 ఏళ్ల అనే వృద్ధుడు మూడు నెలలుగా అనారోగ్యంతో మంచం పట్టి సోమవారం తుది శ్వాస విడిచాడు. ఆ వృద్ధుని అంత్యక్రియలకు వాలంటీర్లే అంతా తామై ఆ కార్యక్రమాన్ని జరిపించారు. ఆ వృద్ధునికి ఆరుగురు సంతానం కాగా, వారిలో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరు వేర్వేరు చోట్ల స్ధిరపడ్డారు. తండ్రి మరణ వార్త వినగానే ఆరుగురు ఇంటికి చేరుకున్నారు. ఏనుగుల బజారు కరోనా రెడ్ జోన్ కావటంతో బుజ్జి అంత్యక్రియలు ఎలా జరిపించాలో తెలియక అతడి కుమారులు ఇబ్బంది పడుతున్నారు.

సంప్రదాయం ప్రకారం ఆ ప్రాంతంలోని మసీదుకు చెందిన పేష్‌మామ్, మౌజమ్‌ వచ్చి మృతదేహానికి స్నానం చేయించి కబ్రిస్థాన్ కు సిద్ధం చేయాలి. బుజ్జి సహజంగానే మరణించినా, కరోనా భయంతో వారు వచ్చేఎందుకు నిరాకరించారు. ఈ పరిస్థితుల్లో వాలంటీర్లు షేక్ సైదావలి, సయ్యద్ జానీ బాషా, సయ్యద్ ఆఫర్ ఖాదర్ ఆ వృద్ధుని అంత్యక్రియలకు ముందుకొచ్చి పీపీఈ కిట్లు ధరించి మృతదేహానికి స్నానం చేయించారు. దానిని పేకాడుబండిగా ప్యాక్ చేశారు. దీంతో మృతుడి కుమారులు భయాన్ని వీడి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జనాజాపై బుజ్జి మృతదేహాన్ని ఉంచి చిలకలూరిపేట రోడ్డులోని కబ్రిస్థాన్ కు చేర్చారు.

ఈ కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ షేక్ రెహమాన్, సచివాలయ శానిటేషన్ సెక్రెటరీ విష్ణురంగా ఏఎన్ఎం జ్యోత్సన పర్యవేక్షించారు. ఈ తంతు చేసిన వాలంటీర్లను అక్కడి స్థానికులు అభినందించారు. అంతే కాకా మున్సిపల్ డీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాలంటీర్లు జామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. బుజ్జిది సహజ మరణమైనందున మృతదేహానికి కరోనా పరీక్షలు చేయించాల్సిన పనిలేదని డీఎండీహెచ్‌వో నిర్ణయించారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో వాలంటీర్లు అన్నీ వారై బుజ్జి మృతదేహాన్నికి అంత్యక్రియలు చేయించడం ప్రస్తుత కాలంలో మానవత్వం ఇంకా మనుగడ సాగిస్తుందని నిరూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here