ఓ సరికొత్త యాడ్ లో కనిపిస్తున్నారు చైతు, సామ్ …!

0
61

నాగచైతన్య, సమంత వెండితెరపై నే కాదు … బుల్లితెరపై నా సందడి చేస్తుంటారు. అదేంటి బుల్లితెరపై నా ? అని ఆశ్చర్యపోతున్నారా ? … అదేనండి వీరిద్దరూ కలిసి బ్రాండ్ అంబాసిడర్ గా కొన్ని ఉత్పత్తుల ప్రకటనలో కలిసి నటించడం గురించి చెప్పుతున్నం. వీరిద్దరూ కలిసి సూపర్ మార్కెట్, సోప్స్ కు సంబంధించిన ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యాడ్ కోసం వీరిద్దరు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సమంత షేర్ చేసిన ఫోటోలు పెట్టిన క్యాప్షన్‌ అదిరిపోతోంది. ప్రస్తుతం లాక్ డౌన్, కరోనా విజృంభణ ఉండటంతో బయటకు రావడం లేదు స్టార్స్. షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన సెలెబ్రిటీలెవ్వరూ బయటకు రావడం లేదు. టీవీ ఇండస్ట్రీలో అసలే కరోనా వ్యాప్తి చెందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో స్టార్స్ ఎవ్వరూ కూడా బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. కానీ చై-సామ్ మాత్రం ఓ యాడ్ షూటింగ్‌కు రెడీ అయ్యారు. అయితే ఇది ఇండోర్ షూటింగ్‌లా కనిపిప్తోంది. వారి ఇంట్లోనే ఈ ప్రకటనకు సంబంధించిన షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా సమంత నాగచైతన్య తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అందులో వీరిద్దరూ వాషింగ్ మెషిన్ వద్ద ఉండగా … పనులు పంచుకుంటున్నామని చెప్పుకొచ్చింది. పని భారాన్ని పంచుకోండని చెబుతూ… సమానమైన భాగస్వామ్యం .. ప్రతిదీ పంచుకోవాలి. అదే మా మంత్రం .. నిన్న, నేడు,రేపు ఎప్పుడైనా సరే. అది సంతోషమైన సరే, ఫుడ్ అయినా సరే. చివరకు బట్టలు ఉతకడం అయినా సరే అంటూ ఏరియల్ యాడ్ షూట్ అని తెలిపింది. ఇందులో చై, సామ్ చూడముచ్చటగా ఉన్నారు. ఈ లాక్ డౌన్ లో వీరిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీరికి కరోనా సోకిందనే రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here