‘సినిమాల్లోకి నాగబాబు అల్లుడు !.

13
Nagababu son-in-law. by mirchipataka

మెగా డాటర్ నిహారికకు గతేడాది చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ ప్రభాకర్‌ కుమారుడు చైతన్య. ఇతను  ప్రస్తుతం ఓ పేరు మోసిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అయితే నిహారిక తనకు కాబోయే భర్తగా చైతన్యను పరిచయం చేసినప్పటి నుంచి అతడి గురించి వివరాలు కలెక్ట్ చేయాలని చాలా మంది ఆసక్తిని చూపారు. ఈ క్రమంలో చైతన్య గురించి చాలా విషయలే తెలుసుకున్నారు. చైతన్యకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. తరచుగా ఇతను టూర్లకు ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. నిహారికతో పెళ్లి తరువాత చైతన్య హీరోగా సినిమాలలోకి ఎంట్రీ ఇస్తాడంటూ చాలా పుకార్లే వినిపించాయి. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్న కల్యాణ్ దేవ్ ఆ తరువాత  సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయ్యాడో అలాగే  నిహారిక భర్త కూడా  అదే తరహాలో సినిమాలలోకి ఎంట్రీ ఇస్తాడని ఇప్పటికే స్క్రిప్ట్‌లు కూడా వింటున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలోక్లారిటీ ఇచ్చారు చైతన్య. మీరు సినిమాల్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది  నిజమేనా.. మీరు, మీ భార్య నిహారిక కలిసి నటిస్తారా.. అన్న ప్రశ్నకు చైతన్య స్పందించాడు. తనకు అలాంటి ఆలోచనలు అసలు లేవని ఈ మెగా అల్లుడు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన ఆలోచనలు వేరని, సినిమాల్లో నటించాలని లేదనితేల్చి చెప్పేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here