‘ఉప్పెన’కు మా కుటుంబం రాకపోవడానికి కారణమదే: నాగబాబు

21
nagababu reacts on mega family absence of uppena event

మెగా కాంపౌండ్‌ నుంచి ఎవరైనా కొత్త హీరో ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే అతనికి సపోర్ట్ గా కుటుంబమంతా కలిసి ప్రీరిలీజ్‌, ఆడియో వేడుకలకు రావడం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాం. అయితే, కొన్నిరోజుల క్రితం ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగిన సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి మాత్రమే ముఖ్య అతిథిగా విచ్చేసారు. ప్రీరిలీజ్‌ వేడుకకు తమ కుటుంబానికి చెందిన హీరోలు ఎవరు హాజరు కాలేదు. దీనికి గల కారణాన్ని నాగబాబు వెల్లడించారు.

”ఉప్పెన’ ప్రీరిలీజ్‌ వేడుకకు మా కుటుంబమంతా రాకపోవడానికి కారణం ఏమి లేదు. వైష్ణవ్‌ని సోలోగానే ప్రెజెంట్‌ చేయాలని మేమంతా అనుకున్నాం. అందుకే మా ఫ్యామిలీ నుంచి అన్నయ్య ఒక్కడే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చాడు. ఆఖరికి వైష్ణవ్‌ తేజ్‌ సోదరుడు సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఈ వేడుకలకు హాజరుకాలేదు. మా అందరికీ మార్గదర్శి అన్నయ్యే కాబట్టి ఆయనే ఆ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.’ అని నాగబాబు ఇటీవల చెప్పుకొచ్చారు. ‘ఉప్పెన’ రిలీజయ్యాక ప్రమోషన్స్‌లో భాగంగా బయటకు వచ్చిన మెగా కజిన్స్‌ స్పెషల్‌ చిట్‌చాట్‌ వీడియో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరుపుకున్న ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో రామ్‌చరణ్‌ సందడి చేసిన సంగతి కూడా తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here