రోగనిరోధక శక్తిని పెంచే మష్రూమ్స్..!!

23
Health Benefits In Mush Rooms

ఊబకాయం లేకపోతే, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడుకునేందుకు మష్రూమ్స్‌ని  రెండో రోజులకు ఓసారి వంటల్లో వాడాలని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. బలమైన రోగనిరోధక శక్తిని పుట్టగొడుగులు కలిగివుంటాయి. ఇవి చలికాలానికి చాలా అవసరమని వాళ్ళు  చెప్తున్నారు.

రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులని  చేర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పుట్టగొడుగులు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా, ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలను కలిగివుండే పుట్టగొడుగుల్లో కేలరీలు తక్కువ.  పుట్టగొడుగులని  కూర, సలాడ్, సూప్ లేదా కూరగాయల్లా ఎన్నో  రకాలుగా తయారు చేయవచ్చు.

పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి లాంటి  ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఎన్నో  వ్యాధుల నుంచి  దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. పుట్టగొడుగులను తినడం వల్ల ఎముకలు బలపడతాయి.

పుట్టగొడుగులలో కేలరీలు చాలా తక్కువ. ఇది తినేవాళ్ళు  ఆకలిని తగ్గిస్తుంది. పుట్టగొడుగు తిన్న తర్వాత, తినేవాళ్ళకి  ఎక్కువసేపు ఆకలి అనిపించదు. దీన్ని తినడం వల్ల కడుపు త్వరగా నిండిపోతుంది.  జంక్ ఫుడ్  అతిగా తినడం నివారించవచ్చు.

శరీరంలో విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు చాలా వ్యాధులు వస్తాయి.  విటమిన్ డి అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు చాలా తక్కువ . ఈ కూరగాయలలో ఒకటి పుట్టగొడుగులు. విటమిన్ డి పుట్టగొడుగులలో పుష్కలంగా లభిస్తుంది.ప్రతిరోజూ పుట్టగొడుగులను తినడం వల్ల శరీరానికి అవసరమైనంత విటమిన్ డి లభిస్తుంది.

పుట్టగొడులో ఉండే  పోషక విలువని  కాపాడుకోవడానికి ఏ విధంగానైనా ఉడికించడం ప్రయోజనకరం. పుట్టగొడుగుల వంటకాలను తయారు చేయడం చాలా సులభం. సలాడ్లు, కూరగాయలు లేదా సూప్ లాంటి ఆహారాల నుంచి రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులని చేర్చవచ్చు అని న్యూట్రీషియన్లు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here