ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ లిస్ట్ లో ముంబై ఇండియన్స్

64
Mumbai Indians

ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా అబుదాబిలో బుధవారం నైట్ ఆడిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) మరో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఎదుట 10 పరుగుల తేడాతో సీఎస్కే పరాజయం పొందింది. రాహుల్ త్రిపాఠి(51 బంతుల్లో 81 పరుగులు) చివరి ఓవర్లలో చెలరేగిపోయి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో నైట్ రైడర్స్ కు విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్ మొదలుపెట్టిన నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 167 పరుగులు సాధించి ఆలౌట్ కాగా.. 168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఆటలో సాధించిన విజయంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ను వెనక్కినెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో స్థానంలో నిలిచింది.


ఐపీఎల్‌లో 21 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 8 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు మ్యాచ్‌లలో గెలుపును సాధించి రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యింది. ఈ జట్టు నెట్ రన్ రేట్ 1.488గా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చి 8 పాయింట్లు, 1.060 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ జట్టు ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో ఆడగా నాలుగు మ్యాచులలో విజయం సాధించగా. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here