పేలవ ప్రదర్శనలో ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్..

29
MS Dhoni's 'lack of spark in youngsters' comment in IPL 2020

మహేంద్ర సింగ్ ధోనీ తీరుపై ప్రస్తుతం అభిమానులందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ గా తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం పేలవ ప్రదర్శన చేయడాన్ని అభిమానులు అసలు చూడలేకపోతున్నారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ లో ధోని గెలిచే మ్యాచ్ ఓడిపోయేలా చేసిన విషయం తెలిసిందే. తన స్థాయి ప్రదర్శన చేయలేక నెమ్మదిగా ఆడి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత క్రికెట్ కు పూర్తిగా దూరమైన మహేంద్రసింగ్ ధోని ఏడాదిన్నర పాటు కనీసం ఎక్కడా కనిపించలేదు.

ఇక ఆ తర్వాత భారత జట్టులోకి వస్తాడు అనుకుంటే.. ఉన్నఫలంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. సరే ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున ఆడిన అభిమానులందరినీ మళ్ళీ ఉత్సాహపరుస్తాడు అని అభిమానులు అనుకున్నారు. ఇక మొదటి మ్యాచ్లో ధోనీ బ్యాటింగ్ కొన్ని బాల్స్ ఆడాడు… మొదటి మ్యాచ్ కదా అందుకే రాణించ లేదేమో అని అనుకున్నారు… ఇక రెండో మ్యాచ్లో కూడా అదే తీరు కొనసాగింది… క్రికెట్ ఆడి చాలా రోజులు అయింది కదా.. ధోని కుదురుకుంటాడులే అని అనుకున్నారు… ఇక మూడో మ్యాచ్లో కూడా ధోని ఆట తీరు మారలేదు. దీంతో ధోని ఆట చూసి మురిసిపోవాలి అని టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులందరికీ నిరాశ తప్పలేదు.

ఇక ఇలా వరుసగా అన్ని మ్యాచ్ లలోను కూడా తన స్థాయి ప్రదర్శన చేయలేక ధోని కేవలం డబుల్ డిజిట్ పరుగులు సాధించడానికి కష్టపడి పోతుండడంను అభిమానులు అస్సలు చూడలేకపోతున్నారు. బెస్ట్ ఫినిషర్ గా పేరున్న ధోని.. పేలవ ప్రదర్శన చేస్తుండడంతో ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రతి మ్యాచ్లో కూడా ధోనీ రాణిస్తాడేమో అని ఆశగా ఎదురుచూసినప్పటికీ ఇప్పటికీ 10 మ్యాచ్లలో అభిమానులకు నిరాశ ఎదురయింది. దీంతో ధోనీ ఇంకెన్నాళ్లు ఈ నిరీక్షణ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here