బెయిల్‌పై వచ్చి మరీ ఫ్రెండ్ తల్లిని…?!

159
Incestuous mother murdered by his son's friend

నాగపూర్ కి చెందిన అశోక్ మూలే పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇతను భార్య సుశీల కొడుకు నవీన్ తో కలిసి నందన్‌ వన్ అనే ప్రాంతం లో నివాసం ఉంటున్నాడు. కాగా నవీన్ కు గొటాఫోడ్ అనే స్నేహితుడు ఉన్నాడు. అతను ఒక నేరానికి సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మధ్య కరోనా మహమ్మారి మూలంగా మధ్యంతర బెయిలు ఫై విడుదల చేసిన వారిలో ఇతనుకూడా ఉన్నాడు.

విడుదల అనంతరం ఇతను తన స్నేహితుడు అయిన నవీన్ ను కలుసుకునేందుకు వారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయం లో సుశీల, నవీన్ ఇద్దరు ఇంట్లో ఉన్నారు. తాను నవీన్ ను కలవడానికి వచ్చానని గొటాఫోడ్ చెప్పగా కరోనా వైరస్ సోకుతున్న ఇలాంటి సమయం లో నువ్వు అసలు నా కొడుకుని చూసేందుకు ఎందుకు వచ్చావ్ అని ఇలాంటి సమయంలో వాడిని, నిన్ను కలవనివ్వను అని నవీన్ తల్లి గొటాఫోడ్ కు ఎదురు తిరిగింది. దీనితో అతనికి కోపం వచ్చి తన వెంట తీసుకు వచ్చిన కత్తితో పొడిచి పారిపోయాడు.

నిందితున్ని పట్టుకునేందుకు నవీన్ ప్రయత్నించగా అతడి పైన కూడా కత్తితో దాడి చేసాడు. నవీన్ స్థానికుల సాయంతో తన తల్లిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీనితో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here