రణ్‌బీర్ షూ ఖరీదెంతో తెలుసా..?

16
most-expensive-sneakers-owned-by-ranbir-kapoor

స్టార్స్‌ ఏది చేసినా అది వారి హోదాకు తగ్గట్టే ఉంటుంది. లేకుంటే ఎప్పుడు కాపు కాచే మీడియా తాటాకులు కట్టేస్తుంది. వారు మంచి డ్రస్సుల్లో కనిపిస్తే ‘బెస్ట్‌ ఫ్యాషన్‌’ అంటూ పొగిడేస్తోంది. చెత్త డ్రస్సుల్లో కనిపిస్తే వరస్ట్‌ ఫ్యాషన్‌ అని విసిగిస్తుంది. అందుకే బయటికొచ్చే ప్రతి స్టార్‌ లక్ష జాగ్రత్తలు వహిస్తారు. తమను చూసి మంచి వార్తలే రాయాలని ఆశిస్తారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఇలాంటి మంచి వార్తలోకి ఎక్కాడు. ఈమద్యే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ బ్లూజీన్స్‌ వేసుకుని, చేతిలో బ్యాగ్‌తో మీడియా కంట పడ్డాడు. అయితే అందరి దృష్టి అతడు ధరించిన స్పోర్ట్స్‌ షూస్‌ మీద పడింది.

నైకి అండ్‌ డియోర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌గా వచ్చిన ఈ స్నీకర్స్‌ ధర దాదాపు ఐదున్నర లక్షల ఉందట. ఆ కంపెనీ ఇలాంటి షూస్‌ని కేవలం 8000 జతలు మాత్రమే తయారు చేసిందట. వాటిలో ఒకజత మన హీరోగారు వేసుకున్నారు. ఇక అతడు పట్టుకున్న బ్యాగ్‌ ధర దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని టాక్. రణ్‌బీర్‌ కపూర్‌ బాలీవుడ్‌ శ్రీమంతుల్లో ఒకరు. తల్లిదండ్రులు రిషికపూర్, నీతూ కపూర్‌ సంపాదించినా ఆస్తి మాత్రమే కాకుండా తను కూడా స్టార్‌ హీరోగా బోలెడంత సంపాదించాడు. రణ్‌బీర్‌ తన కోస్టార్‌ ఆలియాతో డేటింగ్‌లో ఉన్నదన్న సంగతి తెలిసిందే. వారిద్దరు ఈ సంవత్సరం వివాహ బంధంతో ఒక్కటవుతారని ఆశించగా కరోనా వచ్చి ఆ వేడుక కాస్త పోస్ట్‌పోన్‌ అయ్యేలా చేసింది. కాగా రణ్‌బీర్, ఆలియా కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ఈ సంవత్సరం రిలీస్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here