

బిగ్ బాస్ సీజన్ 4లో తన గ్లామర్ లుక్ తో ఆకట్టుకుంది మోనాల్ గజ్జర్. అప్పటి వరకు ఐదారు సినిమాల్లో మాత్రమే నటించిన మోనాల్ గజ్జర్. బిగ్‌బాస్ 4లో అందరిని ఆకట్టుకుంది. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘అల్లుడు అదుర్స్’ మూవీలో ఐటెమ్ సాంగ్ చేసింది మోనాల్. ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలు నెట్టింటో హల్చల్ చేస్తున్నాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించగా ఈ ఈవెంట్ లో గ్రీన్ కలర్ గౌన్‌లో మెరిసింది మోనాల్. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మూవీలో మోనాల్ ఐటెమ్ సాంగ్ హైలైట్‌గా నిలవనుందట. ఆ పాటలో తనలోని సరికొత్త అందాలను చూపించనుందట. మొత్తానికి బిగ్‌బాస్ షో తో సంపాదించుకున్న క్రేజ్‌ను మోనాల్ బాగానే క్యాష్ చేసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.