బేబీ బంప్ తో బాలీవుడ్‌ నటి..

17
mom-to-be-lisa-haydon-shows-off-her-baby-bump-on-beach

బాలీవుడ్‌ నటి, మోడల్‌ లీసా హెడెన్‌ ఇటీవలె తాను మూడోసారి గర్భం దాల్చిన సంగతి ప్రకటించింది. సోషల్‌ మీడియాలో ఫాన్స్ తో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేసే లీసా తాజాగా తన బేబీ బంప్‌ ఫోటోలను పంచుకుంది. గర్భిణీగా ఉన్నా డాక్టర్ల సూచనల మేరకు వ్యాయామం చేస్తున్నారు. ఈ మేరకు ఇండోర్‌ సైక్లింగ్‌ వర్కవుట్‌ సెషన్‌కు ముందు అద్దంలో చూసుకుంటున్న బేబీ బంప్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లీసా హెడెన్‌ తల్లి పాలలో ఉండే పోషకాలు, తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అర్థమయ్యేలా వివరించడం వంటి సామాజిక దృక్పథం కలిగిన అంశాల గురించి ప్రచారం చేస్తుంది. కాగా లీసా హేడెన్‌ జన్మ స్థలం చెన్నై. మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టి బీ-టౌన్‌లో అడుగుపెట్టారు. చాలా ఏళ్లపాటు, హాంకాంగ్‌లో గడిపిన ఆమె… ‘హౌస్‌ఫుల్‌-2’, ‘క్వీన్‌’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్ళిచేసుకుని లీసా వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. వీరికి ఇద్దరు కుమారులు జాక్‌ లల్వానీ, లియో లల్వానీ ఉన్నారు. కాగా ఆమె కుమార్తె పుట్టాలని ఎదురుచూస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here