సూపర్‌స్టార్‌ తో కమల్‌హాసన్..

29
mnm-chief-kamal-haasan-meets-superstar-rajinikanth

ప్రముఖ సినీనటుడు, మక్కల్‌నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తో భేటీ అయ్యారు. మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ కీలకం కానుంది. అయితే, వీరిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని సన్నిహిత వర్గాల సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా తాను రాజకీయాల్లోకి రావడం కుదరదని రజనీ ప్రకటించిన తర్వాత ఆయనతో కమల్‌ భేటీ కావడం ఇదే మొదటిసారి.

రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడతారంటూ ఎంతో కాలంగా వినిపించిన ఊహాగానాలకు గతేడాది డిసెంబర్‌లో రజిని చెక్‌పెట్టిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నుండి తప్పుకున్నట్లు అయన స్పష్టంచేశారు. దీంతో సూపర్‌స్టార్‌ రాజకీయ రంగప్రవేశం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల ఆశలకు తెరపడింది. మరోవైపు, రజనీ ప్రకటన తననూ ఎంతగానో నిరాశకు గురిచేసిందని అప్పట్లో కమల్‌ కూడా వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఆ సమయంలో తిరుచ్చిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కమల్‌.. ప్రచారం ముగిశాక రజనీని కలుస్తానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here