నా బయోపిక్‌లో ఆ బాలీవుడ్ హీరో అయితే బాగుంటుంది…

0
110
Mithali Raj's biopic 'Shabaash Mithu' confirmed

ప్రస్తుతం సినిమా రంగమంతా బయోపిక్ ల మీద దృష్టి పెడుతుంది. ఇప్పటికే ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ జీవితాల ఫై బయోపిక్ లు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళా ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న మిథాలీ రాజ్, టీమిండియాకు తొలి ప్రపంచ కప్పు అందించిన కపిల్ దేవ్‌పై కూడా బ‌యోపిక్‌ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌పై కూడా తన బ‌యోపిక్‌ ని తెరపైకి ఎక్కిస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని గురించి అక్తర్ మాట్లాడుతూ తన ఫై గనుక బయోపిక్ తీస్తే అందులో తనపాత్రకి బాలీవుడ్ సూపర్ స్టార్ ‘సల్మాన్ ఖాన్’ ను పెడితే తన మనసుకి ఆనందంగా ఉంటుందని అక్తర్ తెలిపారు. తనకున్న చివరి కోరిక దేనని అయన తెలియజేసారు. అక్తర్‌ పాక్‌ తరపున ఎన్నో మ్యాచులు ఆడి పాక్ కు ఎంతో ఘనత తెచ్చిపెట్టాడు.

షుమారుగా 400 పైచిలుకు వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్ గా నిలిచాడు. 2003 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అత్యంత స్పీడ్ గా బాల్ వేసిన రికార్డ్ ఇప్పటికి కూడా అక్తర్ పేరే ఉంది. అభిమానులు అతనికి ముద్దుగా పెట్టుకున్న పేరు’ రావల్పిండి ఎక్స్‌ప్రెస్’. షోయబ్ అక్త‌ర్‌కు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో అతను పాకిస్తాన్ కు సంబందించిన ఆటగాళ్లు, బోర్డు గురించే కాకుండా మిగతా అన్ని దేశాల గురించి కూడా కామెంట్ చేస్తుంటాడు. తాజాగా తన యూట్యూబ్ లో కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో భారత్ కు పాకిస్తాన్ కు వన్డే సిరీస్ నిర్వహించాలని సూచించగా భారత మాజీ ఆటగాళ్లు అతనికి బాగా చివాట్లు పెట్టారు. అంతే కాకుండా ఉమర్‌ అక్మల్‌కు పీసీబీ మూడేళ్ల నిషేధం విధించగా దీనికి సంబందించిన విషయం ఫై అక్తర్ యూట్యూబ్ లో అనవసరమైన కామెంట్స్ చేసాడు. దీంతో ఆగ్ర‌హించిన లీగ‌ల్ అడ్వైజ‌ర్ అక్తర్ పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసి దానితో పాటుగా ప‌రువు న‌ష్టం దావా కూడా వేశారు. ఇది అక్తర్ కు పెద్ద షాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here