మిస్బావుల్‌ హక్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవికి ఉద్వానస..రేసులో అక్తర్‌?

0
149
pak coach aktar

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)లో రెండు పదవులను అనుభవిస్తున్న మాజీ క్రికెటర్‌ మిస్బావుల్‌ హక్‌కు చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి వైదొలగడానికి  దాదాపు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు అటు ప్రధాన కోచ్‌గా, ఇటు చీఫ్‌ సెలక్టర్‌గా రెండు పదవులు మిస్బావుల్‌కు అవలారం లేదనే ఆలోచనలో పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.  పాకిస్తాన్‌ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు నెలకొల్పలేక పోవడంతో చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి తొలగించి హెడ్‌ కోచ్‌గా మాత్రమే ఉండేలా చూడాలని పీసీబీ ఆలోచిస్తుంది.  ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం చేయగా, పాకిస్తాన్‌ చీఫ్‌ సెలక్టర్‌ రేసులోకి షోయబ్‌ అక్తర్‌ పేరు వినపడుతోంది. ఈ మేరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో సంప్రదింపులు కూడా చేసినట్టు  అక్తర్‌ ధృవీకరించాడు. అయితే ఆ రెండు పదవులలో తనకు ఏ పదవిని కట్టపెడతారో వేచి చూడాలి అక్తర్ పేర్కొన్నాడు.  ‘పీసీబీతో సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమే. నేను పీసీబీలో కీలక పాత్ర పోషించడానికి బోర్డుతో సంప్రదింపులు జరపడం, పీసీబీ ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లడం రెండు వాస్తవాలే. కానీ తుది నిర్ణయం కాలేదు అంటూనే నేను ప్రస్తుతం ఆనందమయిన జీవితాన్నే గోనసాగిస్తున్నా అంతే కాక నా క్రికెట్‌ కాలంలో బాగా ఆడి ఇప్పుడు సెటిల్‌ అయిపోయా. ఇక పీసీబీకి సేవలందించడమే నేను చేయవలసిన పని.  నేను ఇతరులకు సలహాలు ఇచ్చే విషయంలో ఎవ్వరికి భయపడను. నాకు అవకాశం వస్తే మాత్రం పాకిస్తాన్‌ క్రికెట్‌ను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తాను అని అన్నాడు. బోర్డుకి, నాకు మధ్య జరిగిన చర్చల్లో అటు బోర్డు కానీ, ఇటు నేను కానీ ఎటువంటి గ్రీన్ సిగ్నల్ దాకా వెళ్లలేదని, ఇంకా చర్చల దశలోనే ఉన్నందను త్వరలోనే అనుకూలమైన స్పష్టత ఉండవచ్చని అన్నాడు. క్రికెట్‌లో దూకుడైన ఆలోచనతో కొత్త తరం క్రికెట్‌లో ముందుకెళ్లాలని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ విజయాన్ని, పరాజయాన్ని పక్కన పెట్టి దూసుకుపోయే విధంగా క్రికెట్‌ను ఆడాల్సి ఉందన్నాడు. పాకిస్తాన్‌కు గత క్రికెట్‌ వైభవాన్ని తేవాలంటే తమ ఆటగాళ్ల మైండ్‌ సెట్‌ ను పూర్తిగా మార్చి, పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్లు జావేద్‌ మియాందాద్‌, వసీం అక్రమ్‌, ముస్తాక్‌ అహ్మద్‌ వంటి క్రికెటర్లు లా దూకుడైన స్వభావంతోనే పాక్‌కు ఘనమైన విజయాలను సాదించగలమన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here