పాలు, తేనే కలిపి తీసుకోవడం వలన వీటి నుండి బయటపడొచ్చు.!

26
milk-and-honey-are-natures-most-sacred-treasures

ప్రతి రోజూ పాలు తాగడం వలన చాలా ఆరోగ్యం కలుగుతుంది అని మనకి తెలుసు. అయితే పాలు, తేనె కలిపి తీసుకోడం వలన పోషక విలువలు మెండుగా అందుతాయి. మామూలుగా పాలు, తేనే విడివిడిగా తీసుకున్నాకూడా చాలా మేలు చేస్తాయి. అదే రెండిటినీ కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. మామూలుగా తేనే తీసుకోవడం వల్ల జీర్ణకోశం లోమంచి బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది. పాలలో కొన్ని చుక్కల తేనె కలుపుకొని తాగితే జీర్ణక్రియ మెరుగవడంతోపాటుగా బ్లోటింగ్, క్రామ్ప్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు కనుక పాలు తేనె కలిపి సేవిస్తే మెదడు నుంచి శరీరానికి అంతా బాగుంటుంది అనే సిగ్నల్ అందుతూ ఉంటుంది. దీని మూలంగా చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.

కాబట్టి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టనివారు దీనిని తీసుకుంటే మంచి నిద్రని పొందొచ్చు. పాల లో కాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది. అయితే తేనె లో కలిపి పాలను తీసుకోవడం వల్ల ఈ కాల్షియం శరీరానికి బాగా అందుతుంది. వయసు పై బడిన వృద్దులకు ఇది చాలా మంచిది. గోరు వెచ్చటి పాలు. తేనె కలిపి తీసుకోవడం వల్ల గొంతు లో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీనితో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఏకాగ్రత పెరగడానికి కూడా ఇవి బాగా సహకరిస్తాయి. చల్లని పాలలో తేనె కలిపి తీసుకోవడం వల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలాగే శారీరకంగా, మానసికంగా కూడా బలంగా ఉంటారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు పాలు తేనే కలిపి సేవిస్తే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ ఒత్తిడి తగ్గిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here