ఇక గడ్డి కోసే పనిలో ఉండు…!

0
120
Michael Wan's tweet

ప్రస్తుతం కరోనా వల్ల క్రికెట్ ఆటగాళ్లు అందరు ఇళ్లకే పరిమితులయ్యారు. కరోనా ప్రభావం లేకపోతే అందరు ఐపియల్ లో బిజీగా ఉండేవారు. ఇక టీమిండియాకి ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా కత్తిసాము చేసే స్టైల్ గురించి మనందరికీ తెలుసు. ఇతను రాజ వంశానికి చెందిన సౌరయాష్ట్రా క్రికెటర్. ఇతను హాఫ్ సెంచరీ, సెంచరీ చేసినప్పుడు కానీ, ఏమైనా అరుదైన ఘనతల్ని సాధించినప్పుడు కానీ తన బ్యాట్‌తో కత్తిసాము చేయడం ఇతని పద్దతి. ఈ కత్తి సామును ఒకానొక సందర్భంలో ఆసీస్ ఓపెనర్ బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్ కూడా అనుకరించే ప్రయత్నం చేశాడు.

గత సంవత్సరం ఐపియల్ లో భాగంగా ఓ ప్రకటనలో నటించే క్రమంలో జడేజా తరహాలో బ్యాట్ తో కత్తిసాము చేసి చూపించాడు వార్నర్. కాగా ఈ సారి జడేజా నిజమైన కత్తిని బయటకు తీశాడు. తన ఇంటి ఆవరణలో లాన్ లో కత్తితో ప్రాక్టీస్ చేస్తూ దానికి సంబందించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టును ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కంటపడింది, వెంటనే అతను ట్రోల్ చేస్తూ ఇప్పుడు ఆ కత్తితో ఏం చేస్తావ్. ఇది నువ్వు గడ్డి కోసే సమయం రాక్ స్టార్ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి జడేజా అంగీకరిస్తూనే తనకు గడ్డిని కట్ చేయడం రాదంటూ బదులిచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here