మరోసారి మెగాస్టార్ చిరంజీవి డబల్ యాక్షన్ … ఆ పాత్ర కోసం స్పెషల్ వర్క్ ఔట్స్ …!

0
55

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో డబల్ యాక్షన్ సినిమాలు చాలానే వచ్చాయి. అయితే అందులో సక్సెస్ అయిన సినిమాలతో పాటు ప్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మెగాస్టార్ డబుల్ యాక్షన్ అనగానే ఒక స్పెషల్ ఆసక్తి నెలకొంటుంది. ఇక త్వరలో మరో డ్యూయల్ రోల్ తో మెగాస్టార్ ఉహించని సర్ ప్రైజ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్లు మొదటి నుంచి ఒక టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ లో ఒక మాదిరిగా అలాగే సెకండ్ హాఫ్ లో మరో లుక్ తో కనిపిస్తాడని తెలిసింది. అయితే ఒక్కడే రెండు గెటప్స్ లో కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ నిజానికి ఇద్దరు మెగాస్టార్లు కనిపించనున్నారని టాక్ వస్తోంది. ఒక పాత్ర కోసం బరువు తగ్గాలని ఇప్పటికే స్పెషల్ వర్క్ ఔట్స్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక రామ్ చరణ్ ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ ఉంటుందా లేదా అనే విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మొన్నటివరకు దాదాపు ఫిక్స్ అయినట్లే అనే టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత మెగాస్టార్ ఆలోచన మేరకు కొరటాల రామ్ చరణ్ పాత్రను తీసేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 40 %శాతం షూటింగ్ పనులను పూర్తి చేసిన కొరటాల శివ కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here