‘బుట్టబొమ్మ’ స్టోరీ చెప్పిన ఎస్.ఎస్. థమన్…

0
136
Meet the voice behind Butta Bomma

బన్నీ కెరీర్ లో నే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘అల వైకుంఠపురములో’ చిత్రం. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్ ని బన్నీ ఖాతా లో వేసింది. ఇందులో ప్రతి పాట విన్న ప్రేక్షకుడికి మర్చిపోలేనంతగా ఆకట్టుకుంది. ఇక బుట్ట బొమ్మ పాట గురించి అయితే వేరేగా చెప్పనవసరం లేదు. ఇది ఖండాలు కూడా దాటి మరి క్రేజ్ ను సంపాదించుకుంది. క్రికెటర్ వార్నర్ కూడా తన భార్యతో కలిసి ఈ పాటకు స్టెప్పులు వేసాడంటే అది మాములు విషయం కాదు. ఇంకా బాలీవుడ్ లోని చాలా మంది సెలబ్రిటీలు ఈ పాటకి డాన్స్ చేసిన క్రెడిట్ దక్కించుకుంది ఈ బుట్ట బొమ్మ పాట. ఈ పాట గురించి తమన్ మాట్లాడుతూ ఈ పాట కంపోజ్ చేసినందుకు నేను 50 శాతం క్రెడిట్ మాత్రమే ఆశిస్తున్నాను. మిగతా 50 శాతం బన్నీ గారికే దక్కుతుంది. బన్నీ ఎంత గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేసారో నాకు ఈ సాంగ్ చూస్తున్నంతసేపు చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నట్లే అనిపించింది.

బన్నీ ఈ సాంగ్ కోసం చాల కష్టపడ్డారు. ఫస్ట్ ఈ సాంగ్ ని అసలు సినిమాలో ముందు అనుకోలేదు. వేరే పాట ఉండాల్సింది. కానీ బ్యాక్ ‌గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేసే ముందు బన్నీగారి తో ఒక సారి మాట్లాడి ఫస్ట్ అనుకున్న పాటను తీసేసి బుట్ట బొమ్మ సాంగ్ పెట్టాం. 3 రోజుల్లో ఈ పాటను రెడీ చేయడానికి చాలా కష్టపడ్డాను. షూట్ కూడా చాల తక్కువ సమయంలో చేసారు. ఆ సెట్టింగ్స్, ప్లవర్స్, జానీ మాస్టర్ డ్యాన్స్. అన్నీ చాలా చక్కగా కుదిరాయి. ఈ పాట విషయంలో త్రివిక్రమ్ గారితో కలిసి అయన థింకింగ్ ప్రకారం వెళ్ళాం. అందుకే ఈ పాట వీడియోతో కలిపి వింటే ఒకలా వినబడుతుంది వీడియో లేకుండావింటే ఒకలా వినబడుతుంది. త్రివిక్రమ్ గారు ఒక పెద్ద లైబ్రరీ లాంటి వారు. అయన ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాం కాబట్టి. యంగ్ టైగర్ యాన్.టి.ఆర్ తో అరవింద సమేత, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురము చిత్రాల తో మంచి మ్యూజికల్‌గా పెద్ద హిట్ కొట్టారు.

ఇక బిలియన్ వ్యూస్ విషయం గనక తీసుకుంటే ఇది బన్నీగారి కోరిక.. బన్నీ గారు నా దగ్గరకు వచ్చి బ్రదర్ మీరు త్రివిక్రమ్ గారు కలిసి ఎప్పుడు వర్క్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాను. మీరు చేసిన అరవింద సమేతలోని ‘పెనివిటి’ సాంగ్ లాంటి సాంగ్ ఒకటి కావాలి దాని కోసం నువ్వు ఎలా కష్టపడతావో మాత్రం నాకు తెలియదు. నాకు మాత్రం బిలియన్ హిట్ కావాలంటే అనే సారు. నా నోటి నుండి అవతలి వారు ఏమడిగినా నో అని మాత్రం చెప్పను. అలా చెప్పలేక పాటలు కంపోజ్ చేసే విషయంలో చాల సార్లు రిస్కులు కూడా పేస్ చేశాను. బన్నీ కోరిన వెంటనే తప్పకుండా చేద్దాం బ్రదర్ అని చెప్పేసాను. అయితే త్రివిక్రమ్ గారు మాత్రం ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్ట లేదు బన్నీకి బిలియన్ అని మాటిచ్చావు కదరా తొందరగా చేద్దాం అని అయన ఎప్పుడు నా మీద ఒత్తిడి తీసుకు రాలేదు. ఇంకా నాకు చాల సపోర్ట్ చేసారు. అందుకే ఇలాంటి గుర్తుండిపోయే పాటలు చేయడం సాధ్యమైంది అని థమన్ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here