కుక్క పిల్ల స్కేటింగ్‌ అదరహో…!

0
32
Mark Chapman Shared Dog's scating video

కొన్ని ఆటల్లో మనుషుల ప్రతిభ కంటే జంతువుల ప్రతిభే చాలా చక్కగా కనపరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా మనుషులు స్కేటింగ్‌ చేస్తే ఎక్కడో ఒక చోటు బ్యాలన్స్ తప్పి పడిపోతూ ఉంటారు మరలా లేస్తారు. అలాంటిది ఓ కుక్క పిల్ల రోడ్డుపై చేసిన స్కేటింగ్‌ చూస్తే ఆశ్చర్య పోక తప్పదు. ప్రస్తుతం ఆ కుక్క పిల్ల చేసిన స్కేటింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను అమెరిక‌న్ మాజీ బాస్కెట్‌బాల్ అతగాడు రెక్స్ చాప్మ‌న్ తన ట్వీటర్ ఖాతాలో‌ పంచుకున్నాడు. ‘స్కేటర్‌ గుడ్‌ బాయ్‌…’అని కాప్షన్‌ కూడా జతపరిచాడు. ఆ కుక్క పిల్ల స్కేటింగ్‌ బోర్డుపై నిలబడి రోడ్డుపై దర్జాగా స్కేటింగ్‌ చేసుకుంటూ పోతుంటే దాన్ని చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే.

ఆ చిన్న కుక్కపిల్ల చాలా సునాయాసంగా చేస్తున్న స్కేటింగ్‌ రోడ్డుపై ఉన్న వారిని నవ్వులలో ముంచింది. అది రోడ్డు మీద ఉన్న ఓ మూల మలుపును కూడా చాకచక్యంగా దాటుకుంటూ మరో రోడ్డు వైపుకు వెళుతోంది. చాలా దూరం స్కేటింగ్‌ చేసిన ఆ కుక్క ఒకసారి స్కేటింగ్‌ బోర్డు దిగి అదే జోరుతో మళ్లీ స్కేటింగ్‌ మొదలెడుతోంది. ఈ క్రేజీ వీడియోను ఇప్పటికే సుమారు ఆరు లక్షల మంది వీక్షించగా, పదివేల లైక్‌లు, రెండు వేల రీ ట్వీట్లు రావడం విశేషం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఆ కుక్క పిల్ల నాకుంటే చాలా చక్కగా స్కేటింగ్‌ చేస్తోంది’అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. ‘ఓ మై గాడ్‌.. చాలా అద్భుతం’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ విసిరాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here