

ఈ నెల 12న విడుదలైన మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగానటించిన ఉప్పెన సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ టాక్ గా నిలిచింది.ఇప్పటికే ఈ సినిమా గురించి బాలయ్య మొదలుకుని అనేకమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్ కూడా వచ్చి చేరాడు. ఉప్పెన సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. బుచ్చిబాబు సానాను మీరు తీసిన సినిమా కలకాలం గుర్తుండిపోతుందని కొనియాడారు. కొత్త వాళ్లైనా కూడా వైష్ణవ్, కృతిశెట్టి నటన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు.ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉందని, ఇప్పటివరకు దేవి సంగీతం అందించిన సినిమాలలో ఇదే బెస్ట్ మ్యూజిక్ అవుతుందని అన్నారు. ఉప్పెన లాంటి సినిమా నిర్మించినందుకు గాను సుకుమార్ గారికి మరియు మైత్రి మూవీ మేకర్స్ కి హ్యాట్సాఫ్ తెలిపారు.
ఇది ఎప్పటికి ప్రేక్షకులందరి గుండెల్లో నిలిచిపోయే సినిమా అని అన్నారు.ఈ సినిమా కు పనిచేసిన మీ అందరిని చూస్తుంటే నాకు చాల గర్వంగా ఉంది అని ఉప్పెన టీం ను కొనియాడారు. ఇక సుప్స్టార్ మహేష్ బాబు పొగడ్తలతో ఉప్పెన టీం ఉబ్బితబ్బిబ్బవుతోంది.