దుబాయ్‌లో వర్కవుట్స్‌తో మహేష్ బిజీ..!

21
mahesh-babus-trainer-reveals-actors-30-day-energized

సూపర్ స్టార్ మహేష్ బాబు 40 ఏళ్ళ వయస్సులో కూడా చాలా స్మార్ట్‌గా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. రోజురోజుకు మహేష్ వయస్సు పెరగడం కాదు తరుగుతుందా అనిపిస్తుంది. తాజాగా మహేష్ ఫిట్‌నెస్ కోచ్ మహేష్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం మహేష్ బాబు దుబాయ్ వెళ్లి 30 రోజులు అయింది. అక్కడ కూడా మహేష్ కఠినమైన వర్కవుట్స్, డైటింగ్ చేస్తూ ఫిట్‌గా ఉంటున్నాడు.

షూటింగ్ లో ఎంత శ్రమించినా కూడా వర్కవుట్స్ విషయంలో మాత్రం మహేష్ కాంప్రమైజ్ అవడం లేదు. 2019 నుండి అతనికి ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నాను. గాయాలతో బాధపడ్డప్పటికీ, కోలుకున్న అనంతరం ఆయన ఫిట్‌గా మారిన తీరు అద్భుతం. అందరి వయస్సు ఏడాదికి ఏడాదికి పెరుగుతుంటే, మహేష్ వయస్సు మాత్రం తగ్గుతుంది అని ట్రైనర్ మినాష్‌ గబ్రిఏల్ పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here