సెల్యూట్ టు “ఇండియన్ ఎయిర్ ఫోర్స్”

110
Indian Air Force

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్ తన సత్తా ఏంటో చూపిస్తోంది. ఒళ్లు గగుపొడిచే సాహస విన్యాసాలతో భారత వాయుసేన ఆకాశమే హద్దుగా ఈరోజు అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఎయిర్‌ ఫోర్స్ 88వ ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా యూపీలోని హిందోన్‌లో ఐఏఎఫ్‌ ఇచ్చిన ప్రదర్శన ఆద్యాంతం అలరించింది. ఇండియన్ ఆర్మీలోకీలక పాత్ర పోషిస్తున్న సుఖోయ్‌, తేజస్ యుద్ధ విమానాలు ఆకాశంలో గింగిరాలు కొట్టాయి. అలానే భారత అమ్ముల పొదిలో తాజాగా చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈ రోజు జరిగిన ప్రదయి ర్శన లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


ఇక భారత వాయుసేన ఆవిర్భవించి నేటికి 88 ఏళ్లు అవుతుంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సినీ రాజ‌కీయ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.


తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌డే సంద‌ర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు. `ధైర్యవంతులైన ఐఏఎఫ్ సైనికులందరికీ శాల్యూట్ చేస్తున్నా, జాతీయ భద్రత కోసం ఎల్లప్పుడూ కష్టపడుతున్న వారికి మనం అందరం రుణపడి ఉన్నాం` అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఇక బాలీవుడ్ నటి కంగనా కూడా విషెస్ తెలిపింది. తేజాస్ మూవీ టీమ్ తరపున వాయుసేన వారియర్స్ అందరికీ శుభాకాంక్షలు అని చెప్పిన ఆమె మా సినిమా మీ ధైర్య సాహసాలు, త్యాగాలను ప్రేక్షకులకి కళ్ళకి కట్టినట్టు చూపుతుందని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here