మహారాణి క్లియోపాత్ర జీవితం తెరపైకి

28
cleopatra biopic

ఈజిప్టు మహారాణి క్లియోపాత్ర ప్రపంచంలో ని మహిళలందరిలో అత్యంత ధైర్యవంతురాలు మరియు సాహసవంతురాలు అని పేరు దక్కించుకున్నారు. ఆమె ధైర్యం సాహసంలో మాత్రమే కాదు అందంలో కూడా  మహారాణి అందుకే ఆమె వరల్డ్ ఫేమస్. అలాంటి మహారాణి జీవితంను  తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ కు చెందిన గాల్ గాడోట్ మహారాణి క్లియోపాత్ర పాత్రలో నటించేందుకు  సిద్దం అయ్యింది. గాల్ గాడోట్ హాలీవుడ్ లోనే పేరున్ననటి. ఆమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది.

మహారాణి క్లియోపాత్ర రోల్ లోనటించేందుకు గాల్ గాడోట్ చక్కగా సరిపోతుంది. మహారాణి అందంను మ్యాచ్ చేయడంతో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్ ను సైతం గాడోట్ మ్యాచ్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఫిల్మ్ మేకర్స్ హాలీవుడ్ లో ఇంతకుముందే క్లియోపాత్ర సినిమా వచ్చింది. ఈ సినిమాలో క్లియోపాత్ర గా ఎలిజబెత్ టైలర్ నటించింది ఈ  సినిమా 1963లో వచ్చింది. ఈ సినిమాకు అప్పట్లో నాలుగు ఆస్కార్ అవార్డులు   వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here