చికెన్ దిగుమతులపై నిషేధం విధించిన మధ్యప్రదేశ్!

28
madhya-pradesh-bans-chicken-imports

బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేరళ మరియు ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి చికెన్ దిగుమతులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. పదిరోజులపాటు ఈ నిషేధం అమలుచేస్తున్నట్లు తెలిపింది. దీనిగురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ప్రకటన విడుదల చేసారు. బర్డ్‌ఫ్లూపై అధికారులతో ఉన్నతస్థాయి చర్చలు జరిపిన తరువాత ఇండోర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన దక్షిణాది రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాలకు చికెన్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.

దక్షిణాధిలో కేరళ రాష్ట్రంతో సహా మరికొన్ని రాష్ట్రాల్లోని కోళ్లలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని, అందుకే ముందస్తు జాగ్రత్తగా ఆయా రాష్ట్రాల నుంచి 10 రోజులపాటు మాంసం దిగుమతులు నిషేదించవలసి వచ్చిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కాకులతోపాటుగా గాల్లో ఎగిరే ఇతర పక్షుల్లో కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని, అయితే కోళ్లలో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించలేదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here