“మీ మతాన్ని ప్రేమించండి… పరమతాన్ని గౌరవించండి ”..

0
58
pawan-kalyan

పవన్ అమూల్యమైన సందేశం….
పవన్ కళ్యాణ్ .. రాజకీయాల్లోకి రాక ముందు  వచ్చిన తరువాత కూడా చెప్పిన మాట ఒక్కటే. తన లక్ష్యం, పదవి కాదు ప్రజలందరి శ్రేయస్సు పార్టీ ఉహించనివిధంగా  పరాజయం పొందినప్పటికీ  పవన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.  ప్రజలకోసం పోరాడుతూనే ఉన్నాడు.. పవన్ దగ్గరికి  ఎవరైనా ఓ సమస్యతో వెళుతున్నారు అంటే దానికి కచ్చితంగా పరిష్కారంతోనే తిరిగి వస్తారు. ఇకపోతే ఎన్నికల ముగిసాక బీజేపీ తో పొత్తుపెట్టుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే హిందత్వవాదాన్ని బాగా ఆచరిస్తున్నారు.  అలాగే మద్దతునిస్తున్నారు కూడా.. ఇకతాజాగా అంతర్వేది ఘటన పై పవన్ తీవ్రంగా స్పందించిన సంగతి దాదాపుగా  తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో  మత విద్వేషాన్నిరేకెత్తించే ఇతర రాజకీయ నాయకుల లాగా  కాకుండా ఇప్పటివరకు పవన్  చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు..  ఏ మతం  గొప్పది అని చెప్పలేదు. అంతే కాకుండా ఏ మతం ఫై ప్రత్యక్ష   దాడి  జరపలేదు. అంతే కాకుండా పవన్ తాజాగా ట్విట్టర్ పోస్టులో తన రాజకీయ సంస్థ జనసేన పార్టీ పవన్ హిందూ ముస్లిం మరియు క్రైస్తవుడిగా మూడు రూపాలలో  దర్శనమిస్తున్న ఫోటో ఒకటి  ట్వీట్ చేసింది. “మీ మతాన్ని ప్రేమించండి… పరమతాన్ని గౌరవించండి ”అని పవన్ తన అభిమానులకు మరి ముఖ్యంగా  ఈ దేశపౌరులందరికీ విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా పవన్ ప్రజలందరికి ఎం చెప్పాలనుకున్నాడో  ఈ ఫోటోతో అర్ధమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here