క్రికెటర్ భార్యకు తీవ్ర గాయాలు…! | Liton Das’ wife Devasri Biswas injured in gas cylinder blast

0
147
Liton Das' wife Devasri Biswas injured in gas cylinder blast

బంగాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో పెద్ద ప్రమాదం తప్పింది. లిటన్ దాస్ భార్య దేవశ్రీ బిశ్వాస్ సంచిత (27) టి పెట్టేందుకు వంట గదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగించగా ఒక్క సారిగా సిలిండర్ పేలింది. ఆ సమయంలో ఆమె ముఖాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చేతులకు గాయాలయ్యాయని తెలిపింది. పేలుడు ఉదృతకు కిచెన్ కేబినెట్ కూలి ఆమెపై పడడంతో ముఖానికి, కాళ్ళకి కూడా గాయాలయ్యాయి.

ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగిన లిటన్ దాస్ భార్య ఈ ఘటనని తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూసింది. చావు అంచులదాకా వెళ్లి తప్పించుకున్నానని, చేతులు అడ్డు పెట్టకుండా ఉంటె ముఖమంతా కాలి ఉండేదని ఆమె చెప్పారు. అదే విధంగా ఆమె మహిళలు అందరు గ్యాస్ సిలిండర్ వెలిగించేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి ఒక సారి సిలిండర్ దగ్గర పరీక్షించి ఆ తరువాత వెలిగించడం మంచిదని చెప్పారు. లిటన్ దాస్ మరియు దేవశ్రీ బిశ్వాస్ సంచిత లకు 2019 ప్రపంచ కప్పు తర్వాత వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here