మ్యాచ్‌ నిషేధాన్ని పూర్తి చేసుకున్న ఫుట్‌బాలర్‌ మెస్సీ

0
119
Lionel Andrés Messi latest news

ప్రఖ్యాత ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీపై అంతర్జాతీయ మ్యాచ్‌ నిషేధ గడువు పూర్తయింది. దీంతో అతను వచ్చే నెలలో జరగబోయే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో జాతీయ జట్టు అర్జెంటీనా తరఫున అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సంఘం (ఏఎఫ్‌ఏ) అధ్యక్షుడు క్లాడియో టపియా స్పష్టం చేశారు. గతేడాది కోపా అమెరికా కప్‌ టోర్నీలో భాగంగా మూడో స్థానం కోసం చిలీతో జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఆటగాడు గ్యారీ మెడెల్‌తో మెస్సీ గొడవ పడి రెడ్‌ కార్డుకు గురయ్యాడు.

అంతే కాకుండా ఆతిథ్య దేశం బ్రెజిల్‌ను గెలిపించేలా టోర్నీ ఫిక్స్‌ అయిందంటూ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. దీంతో అతను ఒక అంతర్జాతీయ మ్యాచ్‌ నిషేదానికి గురయ్యాడు. అయితే తాజాగా ఈ నిషేధ కాల పరిమితి ముగియడంతో మెస్సీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ అధ్యక్షుడు అలెజాండ్రో డోమిగెజ్‌ అర్హత సాధించాడని అయన వెల్లడించారు. దీంతో బ్యూనస్‌ ఎయిర్స్‌లో అక్టోబర్‌ 8న ఈక్వెడార్‌తో జరుగనున్న వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ బరిలోకి దిగబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here