LIC హోమ్‌లోన్ సూపర్ ఆఫర్,…….కండిషన్స్ అప్లై!!!!

0
125

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు శుభవార్త!!!

కరోనా మహమ్మారి కారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో వివిధ బ్యాంకులు కూడా హోమ్ లోన్ సహా వివిధ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా ఎల్ఐసీ హోమ్ లోన్ కొనుగోలుదారులకు సూపర్ వడ్డీ రేటు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రయోజనం కొంతమందికి మాత్రమే, సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు పెద్ద మొత్తంలో తగ్గించింది.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL)మార్టగేజ్ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి వడ్డీ రేటును ఏకంగా 60 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.5 శాతంగా నిర్ణయించింది. అయితే ఇందుకు సిబిల్ స్కోర్ 800కు పైన ఉండాలి అదీ కొత్త వారికి మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటు రుణాలు అందించనుంది ఈ మేరకు గురువారం ప్రకటన చేసింది.

కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు నిధుల లభ్యతను పెంచడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యల్లో భాగంగా ఎల్ఐసీ కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో సిద్దార్థ మెహంతి వెల్లడించారు. కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేవారికి అదనంగా 10 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీకే రుణాలు అందించడంతో వడ్డీరేటు 7.4 శాతానికి తగ్గనుంది. ఇప్పటికే తీసుకున్న లేదా కొత్త సింగిల్ టర్మ్ బీమా పాలసీని రుణ ఖాతాకు అనుసంధానించే కస్టమర్లకు మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.4 శాతానికి అందిస్తున్నట్లు చెప్పారు.

వారికి కూడా తక్కువ వ్యయానికి నిధులు వస్తున్నాయని, ఈ ప్రయోజనాలను ఖాతాదారులకు అందించాలని నిర్ణయించామని, ఈ రంగంపై కస్టమర్లకు తిరిగి నమ్మకం కలిగేందుకు ఇది దోహదం చేస్తుందని సిద్ధార్థ మెహంతీ అన్నారు. ఇక పాలసీదారుడు అనుకోకుండా మరణిస్తే టర్మ్ పాలసీ ఆ రుణ భారాన్ని పూర్తిగా భరిస్తుంది కాగా, వివిధ బ్యాంకులు ఇప్పటికే హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here