

ప్రస్తుత రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కిడ్నీ సమస్యలు కూడా ఒకటి. మూత్రపిండాలు వ్యర్థపదార్థాలను ఫిల్టర్ చేస్తాయి. మరియు రక్తం నుంచి అధికంగా ద్రవం గ్రహించడం ద్వారా మూత్రపిండాలకు సమస్యలు రావొచ్చు. మూత్రపిండాలు విఫలం కావడంతో ముఖ్యంగా వ్యర్థాలు పేరుకుపోతాయి. దీనిద్వారా వచ్చే లక్షణాలు అంత తేలికగా ఎవరికీ అర్ధం కావు. అందుకే ఈ సమస్యలు ఉన్న వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే వీటిని అర్ధం చేసుకోగలరు . అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వైఫల్యం మొదలైన కారణాల వల్ల మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. అయితే ముందుగా అర్ధం చేసుకుంటే కిడ్నీ వ్యాధులను త్వరగా నయం చేసుకోవచ్చు. అందువల్ల మీరు వాటిని రెగ్యులర్ గా చెక్ చేయించుకోవాలి.
బాగా అలసిపోవడం:
కిడ్నీ ఫంక్షన్స్ లో అవకతవకలు కారణంగా రక్తంలో టాక్సిన్స్ మరియు మలినాలు పెరిగిపోతాయి . దీనివల్ల ఎక్కువ అలసటకు గురౌతారు .తక్కువ శక్తి కారణంగా పనిమీద దృష్టి పెట్టలేరు.
నిద్రపోవడంలో ఇబ్బంది:
కిడ్నీలు విషతుల్యాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతే అవి రక్తంలో నే ఉండి, రోజూ నిద్రపోయే సమయంలో ఇబ్బంది ని కలిగిస్తాయి.
పొడి మరియు దురద చర్మం:
రక్తంలో ముఖ్యమైన పోషకాలు ఏమీ లేనపుడు ఇది మీ చర్మం పొడిగా మరియు దురదగా మారడానికి కారణమౌతుంది.
తరచుగా మూత్రవిసర్జన:
ఒకవేళ మీరు తరచు మూత్ర విసర్జన చేస్తుంటే మరిముఖ్యంగా రాత్రి సమయంలో, కిడ్నీలు పాడైపోవడం వల్ల మూత్రపిండాల వ్యాధికి ఇది ఒక కారణం కావొచ్చు.
కళ్ళలో ఉబ్బు:
మీ మూత్రపిండం మూత్రంలో చాలా ప్రోటీన్ లీక్ అవడం వలన మీ కళ్ల చుట్టూ ఉబ్బినట్లుగా అవుతుంటుంది.