విశాఖ లో లీకయిన స్టెరిన్ గ్యాస్ పిలిస్తే ఏమవుతుంది?

0
115
LG Polymers in Visakhapatnam

ఈరోజు ఉదయం విశాఖలోని గ్యాస్ కంపెనీ లో స్టెరిన్ గ్యాస్ లీక్ అవ్వడం తో వందల మంది అస్వస్థతకు గురి అయ్యారు. అసలు ఈ గ్యాస్ ఎందుకు ఉపయోగిస్తారు ? ఇది పిలిస్తే ఏమవుతుంది?

విశాఖ నగరంలోని గోపాల పట్నం పరిధిలో గల ఆర్ ఆర్ వెంకటాపురం లో 1997 లో ఎల్ జి పాలిమర్స్ కంపెనీ ని నెలకొల్పారు. దాదాపు 215 ఎకరాల్లో ఉన్న ఈ కంపెనీలో రోజు 417 టన్నుల పాలిస్టరీన్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే స్టెరిన్ అనే గ్యాస్ ను ముడిసరుకుగా పాలిస్టరీన్ ను తయారు చేస్తారు. ఈ గ్యాస్ ను పీల్చడం వల్ల తలనొప్పి వినికిడి సమస్య, నీరసం, కళ్ళ మంటలు ప్రథమంగా కనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఈ గ్యాస్ ని అధిక మోతాదులో పిలిస్తే క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో పాటు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది.

గ్యాస్ లీక్ కి గురి అయిన వారిని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించాలి. శ్వాస తీసుకుకోవడం ఇబ్బందిగా ఉంటె వెంటనే వారికీ ఎక్కువగా మంచి నీళ్లను తాగించాలి. మిగిలిన గ్యాస్ లతో పోలిస్తే దీని బరువు చాలా ఎక్కువ గ ఉంటుంది. గ్యాస్ లీక్ అయిన చోట దాని ప్రభావం ఒకటి లేదా రెండు రోజులు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here