తొలిసారిగా ఏపీలో లంబోర్గిని తయారీ యూనిట్

38
lambarginni

ఆంధ్ర కు మరో ప్రతిష్టాత్మక వాహనాల తయారీ యూనిట్‌ రానున్నది.  స్పోర్ట్స్‌ వెహికల్ కు ప్రసిద్ధి చెందిన ‌ బ్రాండ్‌ లంబోర్గిని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను ఏపీ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. గోల్ఫ్ మరియు  ఇతర క్రీడల్లో ఈ  బ్రాండ్ ప్రీమియం ‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు సంబంధించిన కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ ప్రతిపాదనలు అందజేసింది.

సుమారు ఏపీ రాష్ట్రంలో  రూ.1,750 కోట్ల పెట్టుబడితో వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు, చార్జింగ్‌ స్వాపింగ్, ఆర్‌ అండ్‌ డీ యూనిట్లు పెట్టడానికి కైనటిక్‌ గ్రీన్‌ బోర్డు ఆమోదం తెలిపింది.  కైనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ ‌ సీఈవో మరియు  ఏపీ  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు.

పోర్టు ఆధారిత సెజ్‌ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. పోర్ట్ ఆధారిత ప్రాంతం కావడం తో  రేసులో నెల్లూరు, చిత్తూరు, విశాఖ జిల్లాలు ఉన్నాయి,

లంబోర్గిని వాహనాలతో పాటుగా  కైనటిక్‌ గ్రీన్‌ బ్రాండ్‌ పేరుతో వాహనాలను స్థానిక అవసరాలకు తోడుగా  ఎగుమతి చేసే లాగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.  పదేళ్లలో రాష్ట్రంలో 5 లక్షల వాహనాలు విక్రయిస్తామని, దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని అంచనా.

భారీ  ప్రాజెక్టుగా దీన్ని పరిగణించి దానికి రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరింది. రాష్ట్రంలో ఉన్న  ఆర్‌ అండ్‌ డీలో అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాణిజ్యపరంగా వినియోగిస్తే దీని పై ఒక శాతం రాయితీ చెల్లించడానికి కంపెనీ ప్రతిబంధన లో పేర్కొంది.  కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ లంబోర్గిని బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు  2018లో ఒప్పందం కుదుర్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here