సరికొత్త ఆఫర్స్ తో మార్కెట్లోకి వస్తున్న లలితా జ్యువెల్లర్స్ ..!!

0
204
Kiran Kumar - Chairman and MD of Lalitha Jewellery

డాక్టర్ కిరణ్ కుమార్ గురించి అందరికీ ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు. అదేనండీ మనం ఎప్పుడూ టీవీలలో యాడ్స్ వచ్చినప్పుడు చూస్తుంటాము. ఒకతను “డబ్బులు ఎవరికీ ఊరికే రావు మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీదే” అని వస్తుంటాడు చూడండీ..! ఆయనే డాక్టర్ కిరణ్ కుమార్, లలితా జ్యువెల్లర్స్ చైర్మన్. అయితే ఈయన చాలా సందర్భాలలో.. ఈయన చాలా పేద కుటుంబం నుండి వచ్చాను.. ప్రజల కష్టం తెలుసు.. పేదవాడు దగ్గరనుండీ ధనికుడు వరకు ఎవరైనా నగలు కొనాలంటే ఎన్నో సార్లు ఆలోచిస్తారు. మరి అలాంటపుడు వారికి వారి డబ్బుకి పూర్తి న్యాయం చేయాలన్నది ఈయన పట్టుదల. అందుకోసమే తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను కస్టమర్లకి అందిస్తూ మరింత చేరువయ్యాడు కిరణ్ కుమార్.

ఇప్పుడు లలిత జ్యువెల్లర్స్ తెలుగు రాష్ట్రాలలోనే కాక, సౌత్ లోనే ఒక మంచి గుర్తింపు పొందిన సంస్థగా ఎదిగింది. ఈ లలితా జ్యువెల్లర్స్ తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, భీమవరం, కాకినాడ మరియు హైదరాబాద్ లోని సోమాజీగూడ, కూకట్ పల్లి లో వీరి సేవలనందిస్తున్నారు. అయితే ఈ సంస్థ ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త విధానాన్ని, కొత్త కొత్త ఆఫర్లను తీసుకురానుంది. మార్కెట్లో ఉన్న బంగారు నగల తరుగు ఇంకో 2% bతగ్గించామని చెప్తుంది. అంతేగాకుండా బంగారం తదితర ఆభరణాలపై కూడా 3000 రూపాయలు తగ్గిస్తున్నట్టు చెప్తుంది. ఈ ఆఫర్ ని కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంచుతున్నట్లు చెప్తుంది. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు కిరణ్ కుమార్.

కస్టమర్లకోసం నాణ్యత విషయంలో ఏమాత్రం తగ్గేది లేదు అంటున్నాడు. బయట రెండు మూడు చోట్ల ధరలు కానీవండి, నాణ్యత కానీవండి, అనేకరకాల మోడల్స్ కానీవండి, ఏవైనా ఇక్కడికి అక్కడికీ తేడా ఉంటే వారి వద్దకు రావొచ్చు అని చాలెంజింగ్ గా చెప్తున్నారు. బయట కొన్ని నగల షో రూమ్స్ లా… బయట ఒకటి- లోపల ఒకటి ఉండదు అంటున్నాడు. లక్కీ డ్రాలు, బంపర్ బహుమతులతో ప్రజలని మోసం చేయకుండా నేరుగా కస్టమర్ కి దగ్గరవ్వాలని అనుకుంటున్నాడు కిరణ్ కుమార్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here