సచిన్‌ పేరు పాడు చేస్తున్నారు : లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌

0
38
Lalchand Rajput keen to 'instil accountability'

సచిన్‌ టెండూల్కర్‌ పేరును కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం కావిస్తున్నారని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ).. క్రికెట్‌ అభివృద్ధి కమిటీ (సీడీసీ) చైర్మన్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఓ సంఘటనలో వాపోయారు. ఈ మేరకు అతడు ఎంసీఏ అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌కు ఒక లేఖ ద్వారా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎంసీఏలో వివిధ వయస్సు గ్రూపుల జట్ల సెలెక్టర్లు, కోచ్‌ల పదవులకు రాజ్‌పుత్‌ ఆధ్వర్యంలోని సీడీసీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటుంది. అయితే కొందరు వ్యక్తులు మాత్రం సచిన్‌ పేరు చెప్పి కోచ్‌ల పదవులకు సిఫారసు చేస్తున్నారని రాజ్‌పుత్‌ అభ్యంతరం తెలిపాడు.

‘టెండూల్కర్‌ ను మేం గౌరవం గా చూసుకుంటాం. అయితే ఫలానా వ్యక్తులను ఫలానా పదవులకు కట్టబెట్టడానికి సచిన్‌ సిఫారసులు చేస్తున్నాడని కొందరు మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎవరి పేరైనా సచిన్‌ సిఫార్సు చేయాలనుకుంటే అధ్యక్షుడికో లేదా సీడీసీకో నేరుగా ఫోను చేసి అవకాశం ఆయనకు ఉంది. మేమంతా అతడికి తెలిసిన వాళ్ళమే అని లేఖలో రాజ్‌పుత్‌ పేర్కొనడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here