

ప్రముఖ జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. పాత్రికేయ దిగ్గజం, ప్రఖ్యాత రచయిత, విమర్శకులు, వక్త తుర్లపాటి కుటుంబరావు చనిపోవటం తెలుగు పాత్రికేయ, సాహితీ, కళారంగాలకు తీరని లోటన్నారు. పద్మశ్రీతోపాటు లెక్కకు మించిన పురస్కారాలు వరించినా నిరాడంబర జీవనం సాగించారని తెలిపారు. తన తుదిశ్వాస వరకూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించి పాత్రికేయ భీష్ముడిగా పేరొందారని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి తుర్లపాటి కుటుంబరావు కుటుంబసభ్యులకు లోకేష్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.