పట్టుబిగిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

32
Kings XI Punjab returned to form

ప్రతి సారీ బెంగళూరు జట్టు గురించి ఎంత మంది అతిరథ మహావీరులున్నా లక్ కూడా కలిసిరావాలి అని అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. బెంగళూరు జట్టు ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్టు ఉంది. అందుకే పాయింట్స్ టేబుల్ లో మూడవ స్థానంలో కొనసాగుతుంది. మరి అలంటి పరిస్థితినే ఇప్పుడు ఇంకో జట్టు ఎదుర్కొంటుంది. అదేనండి కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఈ జట్టు మంచి క్రీడాకారులతో నిండి ఉంది. కానీ ఇప్పటికి చాలా ఓటములను చవి చూసింది. కానీ గత కొన్ని మ్యాచులనుండి జట్టు మొత్తం టీమ్ స్పిరిట్ తో ఆడడం వలన పాయింట్స్ టేబుల్ లో అట్టడుగు స్థానం నుండి పైకి ఎగబాకి టఫ్ కంపిటీషన్ లిస్ట్ లో చేరింది.

అందుకు నిదర్శనమే మొన్న ముంబై జట్టుతో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచులే..! గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయేవరకు వెళ్ళి.. ఓటమిని తప్పించుకుని..చివరికి టై గా ముగించి..మళ్ళీ గెలుస్తామో లేదో అన్న పరిస్థితిలో అందరూ మూకుమ్మడిగా గెలవాలి అనే పట్టుదలతో ఆడి ముంబై ఇండియన్స్ నుండి విజయాన్ని లాక్కొని తమ సత్తా చాటారు. అదే ఊపులో నిన్న జరిగిన మ్యాచులో టేబుల్ లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ను నిలువరించి మరొక విజయాన్ని సొంతం చేసుకుంది పంజాబ్ జట్టు. ఈ పరిస్థితుల్లో పాయింట్స్ టేబుల్ చివరి రెండు స్థానాలకోసం అన్ని జట్టులమధ్య రసవత్తర పోటీ జరగనుందన్నమాట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here