టైటిల్ మార్చాం..ఇక 2021 కప్ మాదే అంటున్న పంజాబ్

17
kings-xi-punjab-opt-for-name-change-to-be-called-punjab-kings

ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందుతుంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో మినీ వేలం నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే గతంలో ఎంతో పోరాడినప్పటికీ చివరికి నిరాశతో వెనుతిరిగిన జట్లు ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే ఉద్దేశంతో జట్టు ప్రక్షాళన చేయడమే కాదు వివిధ రకాల మార్పులు కూడా చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే గత ఏడాది ప్రేక్షకుల మనసు గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చివరికి టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. అయితే 2021 ఐపీఎల్ సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొత్త పేరుతో బరిలోకి దిగబోతోంది అన్నది అర్థం అవుతుంది. గత ఏడాది సీజన్ లో పేలవ ప్రదర్శన పై గుర్రుగా ఉన్న పంజాబ్ ప్రాంతం కొంత మంది ఆటగాళ్లను వేలం లో కి వదిలేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫ్రాంచైజీ వద్ద ఏకంగా 53.2 కోట్ల పర్స్ మని ఉంది. మిగతా ఫ్రాంచైజీ లతో పోలిస్తే పంజాబ్ ఫ్రాంచైజీ దగ్గర ఉన్నది ఎక్కువ మొత్తం కావడం విశేషం.

2021 ఐపీఎల్ సీజన్ కోసం ఈనెల 18వ తేదీన చెన్నైలో వేలం జరుగనుంది. ఇక ఈ వేలానికి కొత్త పేరుతో పంజాబ్ ఫ్రాంచైజీ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గా ఉన్న పేరును కింగ్స్ పంజాబ్ గా మార్చేందుకు సిద్ధమైందట ఫ్రాంచైజీ. దీని కోసం బీసీసీఐ అనుమతి కోరగా అటు బిసిసిఐ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీకి ఓనర్లు గా ప్రీతిజింతా, నెస్ వాడియా, మోహిత్ బర్మన్, కరణ్ కాల్ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో మార్పులతో ఐపీఎల్ సీజన్ లోకి అడుగుపెడుతున్న కింగ్స్ పంజాబ్ జట్టు ఈసారైనా టైటిల్ గెలుచుకు పోతుందా లేదా అన్నది అభిమానులు అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here