ఆ ఒక్క పోస్ట్‌ ఎంత పని చేసిందంటే…

0
120
Kerala Artist's Corona Poster Turns into Political Meme Fest ...

కేరళకు చెందిన ఆశిన్‌మున్నుగానే ఆర్టిస్ట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వర్షం కురుస్తున్నప్పుడు ఒక గొడుగును గట్టిగా పట్టుకొని దాని కింద ఉన్న వారందరిని కాపాడుతున్నట్లు ఒక యానిమేటెడ్‌ పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఆ గొడుగు క్రింద చిన్నపిల్లలు, కరోనా పేషంట్స్, డాక్టర్స్, ముసలివారు పోలీసులు అందరు ఉన్నట్లుగా పోస్ట్ పెట్టాడు. అంటే అక్కడి ప్రభుత్వం ఈ గొడుగు క్రింద ఉన్న వారందరిని కాపాడుతున్నట్లుగా ఆయన ఈ పోస్ట్ ను పెట్టాడు. ఈ పోస్ట్ ను యితడు ఏప్రిల్ 17 న తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ఇప్పుడు దీన్ని కేరళలోని రాజకీయ నాయకులంతా కూడా ఎవరికి ఇష్టమొచ్చిన విధంగా వారు మార్చుకుంటూ ఈ పోస్ట్ ని పలురకాలుగా మార్చి, మార్చి, మరీ పోస్టులు పెడుతున్నారు.

ఈ పోస్టర్ ని చూసి కేరళకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒ.రాజగోపాల్ ఇదే పోస్టర్ ని కొన్ని మార్పులు చేసి ఆయన అఫిషియల్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. పినరయి విజయన్‌ పైన ప్రధాని మోదీ ఇంకో పెద్దగొడుగుతో అందరిని కాపాడుతున్నట్లుగా ఉన్న మీమ్‌ని ఆయన షేర్‌ చేశారు. ఇలా చేసినందుకు చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని ట్రోల్‌ చేశారు. మరొకరు ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల.. ప్రధాని మోదీ గొడుగు పట్టుకోగా ఆ గొడుగు పైన ఒక టెంట్ పట్టుకున్నట్లుగా మీమ్‌ క్రియేట్‌ చేశారు. ఈ పోస్ట్ ల సంగతేమోగానీ ఇప్పుడు ఇవి మాత్రం కేరళ రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here