పవన్ కళ్యాణ్ కోసం కీరవాణి మ్యూజిక్ … కేవలం రెండే పాటలట …!

0
55

పవన్ కళ్యాణ్ – కీరవాణి కాంబినేషన్ మొదటిసారి కలుస్తుండడం ఆడియన్స్ లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొంది. ఇద్దరు కూడా 20 ఏళ్ళ పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారే. అయితే దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన కీరవాణి ఒకసారి కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు మ్యూజిక్ అంధించలేదు. ఇక మొదటిసారి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరుపాక్ష సినిమా ద్వారా కీరవాణి పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయబోతున్నాడు. ఇక ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన మ్యూజిక్ విషయంలో ఇప్పటికే దర్శకుడు ఒక నిర్ణయానికి వచ్చాడట. కథను బట్టి సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయట. కేవలం రెండే రెండు పాటలు ఉంటాయంట. అవి కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ లో అప్పుడప్పుడు బీట్స్ రూపంలో ఉంటాయంట. కాని రెగ్యులర్ సినిమాల స్టైల్ లో మాత్రం పాటలు ఉండవంట. ఈ సినిమా కోసం కీరవాణి కొత్త తరహా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వినిపించబోతున్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గట్లుగానే సినిమాలో స్ట్రాంగ్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయట. మరి సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here