ఎట్టకేలకు సెట్స్ పైకి ‘కార్తికేయ 2’ .

13
Kartikeya-2

యువ కథానాయకుడు నిఖిల్ తన హిట్ సినిమా ‘కార్తికేయ’ కి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ సినిమా చాల రోజుల క్రితమే  అనౌన్స్ చేశాడు. అప్పుడెప్పుడో పూజా కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్న ‘కార్తికేయ 2’ షూటింగ్ ఎట్టకేలకు తిరిగి స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. గత రెండేళ్ళనుండి  ‘కార్తికేయ 2’ సినిమా కథ గురించి  చందు – నిఖిల్ కలిసి పనిచేశారు. చందు మొండేటి ఓ అద్భుతమైన పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించబోతున్నాడని అనుకుంటున్నారు. కాన్సెప్ట్ వీడియోలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఓ రహస్యం ఆధారంగా ఒక సరికొత్త విషయాన్ని తెరమీదకు తెస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 25 కోట్లు బడ్జెట్  ఖర్చు పెట్టి  ఈ సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా నటించనుందని  టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here