ఆడటం నీ డ్యూటీ… మాట్లాడటం నా డ్యూటీ..!

0
120
Karthik also spoke about cricket commentators'

ప్రస్తుతం క్రీడా ప్రపంచం లో ఎవరి అభిప్రాయాలు వారివి అయిపోయాయి. కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులు లేకుంటే మ్యాచ్ లు ఎలా ఆడుదామని కొందరు అంటుంటే, కొందరు మాత్రం దేశవాళీ మ్యాచులు ఆడేటప్పుడు కూడా ప్రేక్షకులు పెద్దగా ఉండరు. అందుకని దేశవాళీ మ్యాచులు ఆడడం ఆపేశామా లేదు కదా ఇప్పుడు కూడా అంతే ప్రేక్షకులు లేకుండా ఆడడం మనకేమి కొత్తకాదు అని కొందరు అంటున్నారు. దీనికి టీమిండియా వికెట్ కీపర్, కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ మద్దతుగా నిలిచాడు.

ఇక వ్యాఖ్యాతలు వ్యవహరిస్తున్న తీరుతో చాల మంది బాధపడుతుంటారు. కానీ వారు కామెంట్ చెయ్యకపోతే నువ్వు ఏంటనేది నీకు ఎలా తెలుస్తుంది. కామెంటేటర్ లు నిన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడరు వారు కేవలం ని ఆట గురించి, నువ్వు ఎలా ఆడుతున్నావ్ అనేది మాత్రమే కామెంట్ చేస్తారు. ముందు ఆ విషయం అందరు అర్ధం చేసుకోవాలన్నారు. దీనికి ఒక ఉదాహరణను అయన ఇచ్చారు. ఒకానొక సందర్భంలో ప్రముఖ కామెంటేటర్ ఇయాన్‌ చాపెల్‌ ఒక మ్యాచ్ జరిగేటప్పుడు ఆ మ్యాచులో ఆడే ఒక వ్యక్తి గురించి కామెంట్ చేసారు. అప్పుడు ఆ వ్యక్తి చాపెల్ దగ్గరికి వచ్చి ‘నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్’ అని అడిగాడు. అప్పుడు చాపెల్ ‘ఆడడం అనేది నీ డ్యూటీ మాట్లాడడం అనేది నా డ్యూటీ ‘ అని సమాధానం ఇచ్చారు అని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. కామెంటేటర్‌లు మన కోసమే చెబుతారు అనేది గ్రహించాలని అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here